How to Download Telangana Election Voter Slip Online 2023? - ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

How to Download Telangana Voter Slip Online 2023? - ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

The festival of votes is scheduled to take place on November 30, 2023, in Telangana. The Central Election Commission, State Election Commission, and political party leaders are making arrangements to ensure that all eligible voters can cast their votes on that day. The authorities are taking measures to remove fake votes and add new ones. The process of distributing voter slips to the voters was completed on Saturday. The election staff went door-to-door to deliver the slips. If you haven't received your slip, don't worry. You can download it from the Election Commission website. Simply visit the website and download your voter slip to cast your vote.

What is the benefit of voter slip?

Although we have a voter ID, it's important to understand why we need a voter slip. In our area, there are about four to five polling stations, and we can only vote in one of them. The voter slip tells us which polling booth we should go to, so it's necessary to have it. 

When we go to vote, we must bring our voter ID card or an alternate identity card. If we also bring the voter slip, we can vote quickly and easily.

Download as:

How to Download Telangana Voter Slip Online 2023? - ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

- Go to the Telangana Election Commission website (https://tsec.gov.in/home.do).

- There you will have a voter portal at the top. Click it.

- A new page will open for you. On the left side, there is an option to search voter slips by name. Also, there is another option to download voter slips based on EPIC ID.

How to Download Telangana Voter Slip Online 2023? - ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

You can get your voter slip through these options. When you select the option you have to give details like District, Urban Local Body, Ward, and EPIC number. After giving these you will see voter ID slip. Take a print of it go to the polling booth and cast your vote.

How to Download Telangana Voter Slip Online 2023? - ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

Note: You can also get voter slips through the Voter Helpline app.


నవంబర్ 30, 2023 తెలంగాణలో ఓట్ల పండుగ. ఆ రోజు ఓటర్లందరూ ఓటు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు రాజకీయ పార్టీల నేతలు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నకిలీ ఓట్లను తొలగిస్తున్నారు. కొత్త ఓట్లను చేర్చారు. ఇప్పుడు ఓటర్లకు ఓటరు స్లిప్పులు ఇచ్చే ప్రక్రియ శనివారంతో పూర్తయింది. ఎన్నికల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులను ప్రజలకు అందజేశారు.


మీకు ఆ స్లిప్ రాకపోతే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఇంటర్నెట్‌లో స్లిప్ పొందడం ద్వారా ఓటు వేయవచ్చు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓటరు స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోండి.


ఓటరు స్లిప్ వల్ల ప్రయోజనం ఏమిటి?

ఓటర్ ఐడీ ఉంది కాబట్టి.. ఓటు వేయొచ్చు. మరి ఈ స్లిప్ ఎందుకు అనే సందేహం వస్తుంది. ఎందుకంటే మా ప్రాంతంలో దాదాపు నాలుగైదు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఒకదానిలో మాత్రమే మనం ఓటు వేయగలం. అది ఏ పోలింగ్ బూత్? ఎక్కడ ఉంది అనేది తెలియాలంటే.. ఓటర్ స్లిప్ మన దగ్గర ఉండాలి. అందులో ఈ వివరాలు ఉన్నాయి. మనం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు.. ఓటర్ ఐడీ కార్డు లేదా.. ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుతో పాటు. ఈ స్లిప్ కూడా తీసుకుంటే త్వరగా ఓటు వేయవచ్చు.


ఇలా డౌన్‌లోడ్ చేయండి:

How to Download Telangana Voter Slip Online 2023? - ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

- తెలంగాణ ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌కి వెళ్లండి (https://tsec.gov.in/home.do).

- అక్కడ మీకు ఎగువన ఓటర్ పోర్టల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి.

- మీ కోసం కొత్త పేజీ తెరవబడుతుంది. ఎడమ వైపున, ఓటరు స్లిప్పులను పేరుతో వెతకడానికి ఒక ఎంపిక ఉంది. అలాగే, ఎపిక్ ఐడి ఆధారంగా ఓటర్ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మరొక ఎంపిక ఉంది.

How to Download Telangana Voter Slip Online 2023? - ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఈ ఆప్షన్ల ద్వారా మీరు మీ ఓటర్ స్లిప్‌ని పొందవచ్చు. మీరు ఎంపికను ఎంచుకున్నప్పుడు, మీరు జిల్లా, పట్టణ స్థానిక సంస్థ, వార్డు మరియు EPIC నంబర్ వంటి వివరాలను అందించాలి. వీటిని ఇచ్చిన తర్వాత మీకు ఓటర్ ఐడీ స్లిప్ కనిపిస్తుంది. దాని ప్రింట్ తీసుకుని.. పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయండి.

How to Download Telangana Voter Slip Online 2023? - ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

Note: మీరు ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కూడా ఓటర్ స్లిప్‌లను పొందవచ్చు.

#TelanganaVotes #ElectionDay #VoterSlipDownload #DemocracyInAction #ElectionCommission #VoteWithConfidence

Search Website

Featured Post

10 Tourist Places to Visit in Coorg - తెలుగులో కూర్గ్ ట్రిప్ - Scotland of India

Click for  English Version -   కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు ఇప్పుడు మీరు చదవబోయె ప్రాంతం. ఇక్కడి లోయల్ని, కొండ ...

Popular Articles