ఇప్పుడు మీరు చదవబోయె విహారయాత్ర ప్రకృతి అందాలకు నెలవైన, దట్టమైన అడవిలో మరియు పరవళ్లు తొక్కే గోదావరి నదిలో సాగే పాపికొండల పడవ యాత్ర.
హైదరాబాద్ నుండి అక్బర్ ఫ్యామిలి రైలు మార్గంలో, హాజిమియా ఫ్యామిలి మరియు అష్రఫ్ ఫ్యామిలి మంచిర్యాల నుండి రైలు మార్గంలో భద్రాచలం చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేసి మరుసటిరోజు ఉదయం భద్రాచలం నుండి రోడ్డు మార్గంలో పోచవరం బోటింగ్ పాయింట్ కి చేరుకొని పడవయాత్ర కి సిద్దంగా ఉన్నారు. భద్రాచలం మీదుగా పోచవరం నుండిసాగే పడవ యాత్రకు టిక్కెట్టుధర పెద్దలకు Rs.1250/- మరియు పిల్లలకు Rs.1050/-.
అందమైన పాపికొండల మధ్య బోటు ప్రయాణం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని మిగిలిస్తుంది. పాపికొండల యాత్రలో పాపికొండలు చూడడం కంటే కూడా, పడవ ప్రయాణమే అత్యంత ఆకర్షణీయం. నదికి ఇరువైపుల ఎత్తయినకొండలు, దట్టమైన అడవి, నదిమద్యలో వెండిగిన్నెల మెరిసిపోయే ఇసుక తిన్నెలు, మధ్యలో పరవళ్లుతొక్కే గోదారిపై బోటులో షికారు చేయడం జీవితాంతం గుర్తుండిపోయే తీపిజ్ఞాపకాలు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతోనిండిన పాపికొండల మధ్య బోటు ప్రయాణం చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు పర్యాటకులు. అఖండ జలనిధితో వంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరికి యెదురీధుతూ పడవ సాగుతుంది.
![]() |
Papikondalu Boat Tour With Family |
పడవ ప్రయాణం మొదలయిన కొంచెం సమయానికి అనగ తొమ్మిది గంటలకు పడవ యాజమాన్యం అక్బర్ గార్ల కుటుంబానికి మరియు పడవలోని అందరికి అల్పాహారం అందించారు, బ్రేక్ ఫాస్ట్ లో అందరు ఉప్మా తిన్నారు. బ్రేక్ ఫాస్ట్ చేస్తునే వారి పడవ ప్రయాణం ముందుకు సాగింది.
ఇప్పుడు కొంచెం పాపికొండల గురించి తెలుసుకుందాం. పాపికొండలు, దక్షిణ భారతదేశంలోని తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వతశ్రేణి. ప్రకృతి ప్రేమికులకు ఉత్తమ పర్యాటక ప్రదేశం. పాపికొండలు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలు మరియు తెలంగాణలోని ఖమ్మం జిల్లాల సరిహద్దు సంగమ ప్రాంతంలో ఉన్నాయి. పాపికొండల పర్వతశ్రేణి గోదావరినదివెంబడి విస్తరించి ఉంది. ఈ ప్రాంతం 1,012.86 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించివుంది. ఇది అంతరించడానికి చేరువలో వున్న వివిధ మొక్కలు, పక్షులు, జంతువులతో జీవవైవిధ్యంగల ప్రదేశం. రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, తెలంగాణలోని భధ్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోవున్న ఈ ప్రాంతం జాతీయ వనంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులురాల్చవు. ఇది ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణము కారణంగా ఆంధ్రాకాశ్మీరం అని పిలుస్తారు. ఈ ప్రాంత అడవుల్లో పెద్దపులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు, జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిదరకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు మొదలైన జంతుజాలం వుంది. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు వున్నాయి.
గోదావరినది, బాగా దట్టంగా ఉండే అడవులు. పూర్తిగా పల్లెటూరి వాతావరణం. ఇప్పటికీ దగ్గర్లో దొరికేకలపతోనే వంటలు చేసే కొంతమంది జనం. ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని చూడాలి అని అనుకునేవారందరికీ పాపికొండలు స్వాగతంచెప్తాయి. పాపికొండలు ఒక్కటే కాదు అక్కడే ఉండే పేరంటాలపల్లి, కొల్లూరు బేంబూ హట్స్, పోలవరం ప్రాజెక్ట్, కొరటూరు కాటేజెస్ అన్నీ చూడాల్సిన ప్రదేశాలే. ఇంకా ఇక లాంచీలమీద ప్రయాణం మర్చిపోలేని మధురానుభూతినిస్తుంది. అసలు పాపి కొండలకి ఈ పేరు ఎలా వచ్చిందంటే. కొండల మధ్య ప్రవహించే గోదావరి మనం జుట్టుకు తీసుకునే పాపిడిలా వుంటుందని పాపిడి కొండలు అన్నారట. అలా అలా పాపికొండలయ్యిందని అంటారు.
![]() |
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour |
![]() |
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour |
నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి పదహారు వందల కిలోమీటర్లు ప్రయాణంచేసి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సముద్రంలో కలుస్తుంది. రాజమండ్రి దగ్గర 5 నుంచి 6 కిలోమీటర్ల వెడల్పు వుండే గోదావరి పాపి కొండల మధ్య 200 నుంచి 500 మీటర్ల వెడల్పు మాత్రమే ఉండి రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది. రామయ్యపేట దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయింది. గోదావరికి ఒక గట్టుమీద వున్న రామయ్యపేటనుంచి ఇంకో గట్టుమీద వున్న చిన్న కొండదాకా డామ్ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయితే 235 గిరిజన గ్రామాలు, పాపి కొండలు సగం 100 అడుగుల పైగా మునిగిపొతాయి. 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందటమేగాక విద్యుదుత్పాదన కూడా జరుగుతుంది. అంతేకాక త్వరలోనే పాపికొండలు, ఆ కొండలమధ్యలో ప్రశాంతంగా ప్రవహించే గోదావరి అందాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ కారణంగా కనుమరుగు కాబోతున్నాయి.
పేరంటాలపల్లి గ్రామం
పేరంటాలపల్లి పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో ఒక మారుమూల గిరిజన గ్రామం. పర్యాటకులు ఇక్కడి అందాలను ఆస్వాదించేందుకు ఆగు తారు.
![]() |
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour |
![]() |
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour |
పేరంటాలపల్లి దర్శన విరామం తరువాత మళ్లీ పడవ ప్రయాణం మొదలైనది. దర్శనం చేసుకునేవారు శివుని దర్శనం చేసుకొని, వారితో తెచ్చుకున్న కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అక్బర్ కుటుంబం మాత్రం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదించి ఫోటోలు తీసుకొని మళ్లీ పడవ ఎక్కడం జరిగినది. ఇప్పటికి పడవ ప్రయాణం మొదలై దాదాపు మూడు గంటలు కావస్తోంది. ఉప్మా తిని బయలుదేరిన అందరు ఇప్పుడు లంచ్ కోసం ఏదురుచూస్తున్నారు.
విహారయాత్రల వల్ల కలిగే లాభాలు. మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని, ఉత్తేజాన్ని, మానవ సంబంధాలనీ, ఉద్యోగ పనితీరును మరియు దృక్పథాన్ని మెరుగుపరుస్తుంది. విహారయాత్ర మిమ్ముల్ని రిఫ్రెష్‌గా మరియు మీరు తిరిగి వచ్చినప్పుడు చేసే ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి మరింత సిద్ధంగా ఉండటానికి సహాయపడుతుంది. విహార యాత్రల వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు ఒత్తిడిని దూరం చేస్తుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఆనందాన్ని పెంచుతుంది. విహారయాత్రలు పనిభారం కారణంగా ఏర్పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. కావున ప్రతి ఆరునెలలకు ఒకసారి లేదా కనీసం ఒక సంవత్సరంకు ఒక్కసారైన విహారయాత్రలకు ప్లాన్ చేయండి.
![]() |
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour |
వేసవి కాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. భధ్రాచలం వద్ద మునివాటం దగ్గర జలపాతం ఉంది. ఇక్కడ సర్పం నీడలో శివలింగం అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తుంది. రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.
ఓ వైపు గోదావరి విశేషాలను చెప్తూనే....పడవలోని సిబ్బంది నృత్యాలు, చక్కని జోకులతో సందర్శకులను అలరిస్తుంటారు. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారు డెక్ పైనా కూర్చోని ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది. సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు. ఓ వైపు గోదావరి గలగలలు.. మరో వైపు ప్రకృతి సొయగాలు.. చుట్టూ కొండలు.. అద్భుతమైన వాతావరణం.. వీటన్నింటి నడుమ ప్రయాణమే పాపికొండల యాత్ర. గోదావరమ్మ సడులను వింటూ.. పాపికొండల అభయారణ్యాన్ని చూస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణిస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం.
![]() |
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour |
![]() |
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour |
పడవలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు: బోటు సిబ్బంది మరియు గైడ్‌తో బోట్ మేనేజర్. టాయిలెట్ మరియు సీటింగ్‌తో కూడిన గ్రౌండ్ ఫ్లోర్. డయాస్ మరియు ఆడియో సిస్టమ్తో ఓపెన్ డెక్‌లో మొదటి అంతస్తు. అలాగే బోటు సిబ్బంది చేసె కాంప్లిమెంటరీ వినోద కార్యక్రమాలు.
0 comments:
Post a Comment