Telangana Latest Election Opinion Poll Today: KTR Responds - Rajneeti Elections Opinion Poll

Latest Survey Report Indicates Assured Victory for this Party in Telangana: KTR Responds

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ప్రధాన పార్టీలన్నీ ప్రజల్లోకి వెళ్లాయి. రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో నవంబర్ 30, 2023న పోలింగ్ నిర్వహించనుంది. ఈ ప్రక్రియ ఒకే విడతలో పూర్తవుతుంది. డిసెంబర్ 3న కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం ఓట్ల లెక్కింపు ఒకే రోజు జరగనుంది. రాజు ఎవరు? బంటు ఎవరు? అప్పుడే తేలిపోనుంది.

ఇక్కడ త్రిముఖ యుద్ధం జరుగుతోంది. భారత్ రాష్ట్ర సమితి తన సత్తా చాటేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో బీఆర్‌ఎస్ పార్టీ ఉంది. బీఆర్‌ఎస్ దూకుడును అరికట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పలు ఎన్నికల సర్వే సంస్థలు తమ అభిప్రాయ సేకరణను విడుదల చేస్తున్నాయి. తమ అంచనాలను బయటపెడుతున్నారు. ప్రజల నాడి ఎలా ఉందో తేలిపోయింది. ఎన్నికలను ఎదుర్కొంటున్న తెలంగాణ సహా మిగిలిన నాలుగు రాష్ట్రాల ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. తాజాగా రాజనీతి సర్వే ఆర్గనైజేషన్ తెలంగాణపై తన తాజా సర్వే నివేదికను విడుదల చేసింది.  రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజాభిప్రాయాలతో రూపొందించిన నివేదిక ఇది. మొత్తం 38,351 మంది అభిప్రాయాలను సేకరించారు. వారి అభిప్రాయాలను క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు.

రాజనీతి సర్వే సంస్థ మొత్తం తొమ్మిది సంఘాల నుంచి ఈ అభిప్రాయాలను సేకరించింది. ఇది వారిని రైతులు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, MSME రంగానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, బస్సు/ఆటో డ్రైవర్లు, పక్కా గృహ యజమానులు మరియు ఇతరులుగా విభజించబడింది. ఇందులో అన్ని వర్గాల ప్రజలు మరియు అన్ని వయసుల వారు ఉన్నారు.

రాజనీతి ఒపీనియన్ పోల్ భారత్ రాష్ట్ర సమితి తన అధికారాన్ని నిలుపుకుంటుందని అంచనా వేసింది. మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. బీఆర్‌ఎస్‌కు 75 సీట్లు వస్తాయని పేర్కొంది. 42.43 శాతం ఓట్లు పోల్ అవుతాయని వివరించింది. మరోసారి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది.

కాంగ్రెస్‌కు 31 సీట్లు వస్తాయి. 32. ఓట్లు 62 శాతం వరకు పడిపోవచ్చని రాజనీతి అంచనా వేసింది. దీని ప్రకారం తెలంగాణలో హస్తం పార్టీ మరోసారి విఫలం కావచ్చు. మూడోసారి కూడా ప్రతిపక్ష స్థానానికే పరిమితం కానుంది. గతంతో పోలిస్తే అసెంబ్లీలో బలం పెంచుకోగలుగుతుంది. రాజనీతి ఒపీనియన్ పోల్ ప్రకారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఐదు నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధిస్తారు. 16.71 శాతం ఓట్లు పడతాయి. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌కు ఏడు సీట్లు వస్తాయి.

Telangana Latest Election Opinion Poll Today: KTR Responds - Rajneeti Elections Opinion Poll

ఈ అభిప్రాయ సేకరణపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పందించారు. దీన్ని ఆయన స్వాగతించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.


The heat of assembly elections in Telangana has reached a flag level. The momentum of the campaign increased. After the election schedule has already been released.. all the major parties have gone to the public. All the houses greet each other. Roadshows and public meetings are being held.

Central Election Commission will conduct polling in Telangana on the 30th of November 2023. This process is completed in a single instalment. Counting on 3rd December. Along with Telangana, Madhya Pradesh, Chhattisgarh, Rajasthan and Mizoram will count the votes on the same day. Who is the king? Who is Bantu? That is when it became clear.

There is a three-pronged battle here. Bharat Rashtra Samithi has completed the exercise to maintain its power. The election campaign is going on vigorously. Is the party determined to score a hat-trick? The opposition Congress and Bharatiya Janata Party are putting all their efforts to stop the aggression of BRS.

In this situation, many election survey organizations are releasing their opinion polls. They are revealing their expectations. It is clear how the people's nerves are. Some national media organizations have already expressed what will be the opinion of the people of the remaining four states, including Telangana, which are facing elections. Recently Rajneeti Survey Organization released its latest survey report on Telangana. It is a report prepared with public opinions of 119 assembly constituencies across the state. A total of 38,351 opinions were collected. Their views have been collated and this report has been prepared.

Rajneeti Survey Organization has collected these opinions from all nine communities. It divides them into farmers, students, software workers, government employees, unemployed, aspiring entrepreneurs of MSME sector, bus/auto drivers, Pakka house owners and others. It includes people from all walks of life and all ages.

A Rajneeti opinion poll predicts that Bharat Rashtra Samithi will retain its power. She believes that she will come to power for the third time. It said that BRS will get 75 seats. It explained that 42.43 per cent of votes will be polled. BRS has made it clear that it will once again form the government with an absolute majority.

Congress will get 31 seats. 32. Rajneeti predicted that the votes could fall up to 62 per cent. According to this, the Hastam Party may fail once again in Telangana. The third term will also be limited to the opposition seat. Compared to the past, it will be able to increase its strength in the assembly. According to the Rajneeti Opinion Poll, candidates from the Bharatiya Janata Party will win only five constituencies. 16.71 percent of votes will fall. All India Majlis-e-Ittehadul Muslimeen will get seven seats.

BRS Executive President and Minister KTR responded to this opinion poll. He welcomed this. He called Jai Telangana. 


#TelanganaElections #SurveyReport #KTRReaction #PoliticalPulse #ElectionUpdates #TRS #VictoryPrediction #RajneetiSurveyOrganization #TelanganaAssemblyElections

Search Website

Featured Post

10 Tourist Places to Visit in Coorg - తెలుగులో కూర్గ్ ట్రిప్ - Scotland of India

Click for  English Version -   కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు ఇప్పుడు మీరు చదవబోయె ప్రాంతం. ఇక్కడి లోయల్ని, కొండ ...

Popular Articles