అడవిలో విడిది - The wilderness is in the forest
వరంగల్ నుంచి బొగత జలపాతానికి వెళ్ళే దారిలో సరిగ్గా 74 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తాడ్వాయి వస్తుంది. చక్కటి చిక్కటి అడవి..మధ్యలో నల్లతాచులా నిగనిగలాడే రోడ్డు. ఆరోడ్డు పక్కనే అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన కాటేజేస్. ఒకదానికి మరో దానికి మధ్య కావలసినంత ఎడం. మధ్యలో ఏపుగా, ఆకాశాన్ని అంటేలా పెరిగిన చెట్లు. కావలసినంత ప్రశాంతత, ఏకాంతం. అనుభవించే మనసు ఉంటే..అదొక అద్భుతమైన లొకేషన్. డబల్ బెడ్ రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, ఏసీ, టీవీ భలే ఏర్పాట్లు ఉన్నాయి.
దగ్గరలోనే బ్లాక్ బెర్రీ ఐలాండ్. అది మరో అద్భుతం. మనకు ఇంత దగ్గరలో ఇంత అద్భుతమైన ప్రపంచం ఉందా? అన్పించక మానదు. ఇది ఖచ్చితంగా చూసి తీరాల్సిన ప్రదేశం.
కాటేజేస్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉంటాయి. మరో వైపు 25 కిలోమీటర్ల దూరంలో లక్నవరం చెరువు ఉంటుంది. ఇంకోవైపు 50 కిలోమీటర్ల దూరంలో విశాలమైన గోదావరి, దాని మీద సుదీర్ఘమైన వంతెన ఉంటాయి. అది దాటి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే బొగత జలపాతం వస్తుంది.
ప్రకృతిని ప్రేమించి, పరవశించాలనుకుంటే ఎక్కడో దూర ప్రదేశాలను వెతుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తాడ్వాయి రండి. మీ మనసుని హరిత భరితం చేసుకోండి.
పూర్తి వివరాలకు అక్కడ మేనేజర్ ఉంటారు.పేరు సాయికృష్ణ. ఆయన ఫోన్ నెంబర్ 9553382636.
Bogatha Waterfall is located 120 kilometers from Bhadrachalam, 90 kilometers from Mulugu and 140 kilometers from Warangal.
పూర్తి వివరాలకు అక్కడ మేనేజర్ ఉంటారు.పేరు సాయికృష్ణ. ఆయన ఫోన్ నెంబర్ 9553382636.
Bogatha waterfall (Bogatha Jalapatham) is located in the Chikupally village of Wazeedu mandal in Mulugu district, Telangana state. It’s bounded by dense forest, hills and water streams and one can see many tribal villages nearby. The waterfalls can be seen at its best between July to November months.
Bogatha Waterfall 280 Km from Hyderabad, A beautiful waterfall in the dense forest. To see the most beautiful and attractive waterfalls, the natural beauty of nature.
Route map: Hyderabad - Bhongir - Hanamkonda - Eturnagaram - Wajeedu - Chikupally - Bogatha Waterfalls
Address: Chekupelli, Wajedu Road, Chekupalli Rd, Koyaveerapuram G, Telangana 507136