పేద ప్రతిభావంతులకు అండ - North South Foundation Scholarship 2018

 
*పేద ప్రతిభావంతులకు అండ*

♦ఉపకారవేతనాలకు దరఖాస్తులు ఆహ్వానించిన *‘నార్త్‌ సౌత్‌ ఫౌండేషన్‌’*

ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ‘నార్త్‌ సౌత్‌ ఫౌండేషన్‌’ ఆర్థిక తోడ్పాటునందించనుంది. చదువు కొనసాగించడంలో వారికి సహకరించేందుకుగాను ఉపకారవేతనాలు అందించనుంది. ఈ మేరకు అర్హులైన విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులు ఆహ్వానించింది.
*♦అక్టోబరు 15ను దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీగా నిర్ణయించింది.* ఈ ఏడాది మొత్తం మూడు వేలమందికి ఉపకారవేతనాలు అందజేయనున్నట్లు వెల్లడించింది.

♦10వ తరగతి, 12వ తరగతి(ఇంటర్మీడియట్‌), సీఈటీ/జేఈఈ/నీట్‌ ఫలితాల్లో తమతమ రాష్ట్రాల్లో అత్యధిక మార్కులు/ర్యాంకులు పొందిన 10 శాతం మందిలో ఒకరిగా ఉన్నవారే ఉపకారవేతనానికి అర్హులని తెలిపింది. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, డెంటల్‌, వెటర్నరీ, వ్యవసాయ ప్రొఫెషనల్‌ కోర్సుల్లో లేదా ప్రభుత్వ/ప్రభుత్వ సహకార పాలీటెక్నిక్‌ కళాశాలల్లో వారు ప్రవేశాలు పొంది ఉండాలని.. *కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష కంటే తక్కువ ఉండాలని స్పష్టం చేసింది.*

*♦ప్రభుత్వ, ప్రభుత్వ సహకార పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఉపకారవేతనాల మంజూరులో ప్రాధాన్యమిస్తారు.*

♦విద్యార్థులు https://www.northsouth.org/app6/Login.aspx లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ‘నార్త్‌ సౌత్‌ ఫౌండేషన్‌’ అమెరికా కేంద్రంగా పనిచేస్తోంది.


Share:

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

You may also like

Popular Articles

Blog Archive