Why Rs 500 and 1000 notes are banned in India


500/1000 నోట్ల రద్దు వెనుక అసలు రహస్యం ఇది.

మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 500/1000 నోట్లు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం అంత ఆశామాశీగా తీసుకున్నది కాదు. ఇందులో ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది. అతి సామాన్యులమైన మనకి అది తెలియదు. ఈ ఆలోచన గొప్పతనం తెలియక మనం మోడీ గారిని, మన ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నాం. నిజమే, లైన్లో నుంచున్నవాళ్ళకే తెలుస్తుంది ఆ భాధ ఏంటో. కానీ ఆ ఆలోచన ఏంటో తెలిశాక మనం నుంచున్నది మన మంచి కోసమే అని అర్ధం చేసుకుంటారు.

అసలు ఇంతకీ ఆ ఆలోచన ఏంటి? దానివల్ల మామూలు మనుషులకు కలిగే లాభం ఏంటి?

ఈ విషయాలు తెలుసుకునే ముందు మనం డబ్బు గురించి కొన్ని శాస్త్రీయ విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడనుంచి కాస్త జాగ్రత్తగా చదవండి.

మీకు ఎప్పుడైనా అనిపించిందా, డబ్బు కాగితాలను ముద్రించేది మన ప్రభుతమే కదా, అలాంటప్పుడు డబ్బులు అందరికి కావలసినన్ని ముద్రించి ఇచ్చెయ్యచ్చు కదా? అలాంటప్పుడు ఇక పేదవాళ్ళు అసలు ఉండరు కదా?
అలా మనం చేస్తే దేశం నాశనం అవ్వడం ఖాయం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అసలు డబ్బు ముద్రించాలంటే దానికి పాటించాల్సిన పద్ధతి ఏంటో ముందు తెలుసుకుందాం.

మీరు మన డబ్బు నోట్లమీద చూసే ఉంటారు, మన RBI గవర్నర్ సంతకం దగ్గర ఒక సందేశం, హిందీ లో మరియు ఆంగ్లం లో ఇలా ఉంటుంది "I promise to pay the bearer the sum of One Hundred Rupees" ఈ సందేశం అర్ధం ఏంటో తెలుసా మీకు?

తెలియకపోతే వినండి. దాని అర్ధం ఏంటంటే RBI గవర్నర్ గారు మనకి ప్రమాణం చేస్తున్నారు, ఒకవేళ మీకు ఈ వంద రూపాయలు అవసరం లేదనుకోండి , మీరు మీ డబ్బుని భారత ప్రభుత్వానికి ఇచ్చేదాం అనుకుంటున్నారు అనుకుందాం, ఆ సందర్భంలో RBI మనకి 100రూపాయలకు సరిపడా బంగారం ఇస్తుంది.

మీ దగ్గర 1 రూపాయి ఉన్నా, 100 కోట్లు ఉన్నా, ఆ డబ్బు మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేసి ఆ డబ్బుకి సరిపడా బంగారం తీసుకోవచ్చు.

ఈ సుత్తి అంతా ఎందుకు చెప్తున్నావురా బాబు అనుకుంటున్నారా? ఆగండి ఇక్కడే అసలు విషయం దాగి ఉంది.

మన దేశ ఆర్ధిక పరిస్తితిని మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారంతో కొలుస్తారు. ప్రభుత్వం దగ్గర ఎంత ఎక్కువ బంగారం ఉంటే అన్ని ఎక్కువ డబ్బులు ముద్రించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనలో ఎవరైనా మాకు డబ్బు వద్దు , ఈ డబ్బు మీరు తీసేసుకోండి అన్నప్పుడు, ప్రభుత్వం దగ్గర డబ్బుకి సరిపడా బంగారం ఉండాలి కదా మనకి ఇవ్వడానికి. అర్ధం అవుతుంది కదా?

అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడా డబ్బుని ముద్రిస్తారు అని.

ఈ బంగారానికి నల్ల డబ్బుకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? హా అక్కడికే వస్తున్నా.
మన ప్రభుత్వం డబ్బు ఎన్నో సంవత్సరాల నుండి ముద్రిస్తూ ఉంది. బంగారం నిల్వలు పెరిగిన కొద్ది డబ్బు ముద్రించడం కూడా పెరిగింది. ఆ డబ్బు అంతా బ్యాంకుల ద్వారా సామాన్య ప్రజలకు చేరుతుంది. అయితే ఈ డబ్బు సామాన్యులకి ఉపయోగపడకుండా బడా బాబుల బీరువాల్లోకి చేరిపోయింది.

పెద్ద పెద్ద నల్ల బాబులంతా దేశం లో ఉన్న డబ్బులో చాలా మటుకు ఏదో విధంగా సంపాదించి, సంపాదించిన దానికి టాక్స్ కట్టకుండా, దాచి పెట్టేసారు. ఇలా టాక్స్ కట్టకుండా, బ్యాంకులో వేయకుండా డబ్బుని దాచినందువల్ల ఎవరికీ ఉపయోగం లేదు. వాళ్ళంతట వాళ్ళు ఖర్చు పెట్టకపోతే, ఆ డబ్బుకి చిత్తు కాగితాలకి తేడా లేదు.

ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే, ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతుంది. బడ్జెట్ లో ఏముంటుంది అంటే ఈ సంవత్సరానికి మన దేశ ఆదాయం ఎంత ? ఎంత ఖర్చు చేసుకోవచ్చు ?, ఎంత అప్పు చేయాలి?, వచ్చే ఏడాది మన ఆదాయం ఎంత ఉండాలి ? ఇలాంటి లెక్కలు ఉంటాయి.

గత కొన్ని సంవత్సరాల బడ్జెట్ గనుక మనం చూసినట్లయితే మనకి తెలిసే విషయం ఏంటంటే మన ఆదాయం కంటే మన ఖర్చులు ఎక్కువ. తరతరాలుగా మన దేశ పరిస్తితి ఇలానే ఉంది. మన ఆదాయం కంటే మన ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల మనది ఎప్పుడూ లోటు బడ్జెట్ అంటారు. అంటే మన దగ్గర దేశాన్ని నడపడానికి సరిపడా డబ్బు లేదని అర్ధం. సరిపడా డబ్బు లేనందువల్ల ప్రతి ఏడాది మనం ప్రపంచ బ్యాంకు దగ్గర, మరియు ఇతర దేశాల దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా డబ్బు లేకపోవడాన్ని ఆర్ధిక లోటు అని కూడా అంటారు.
మన మోడీ గారు ఈ ఆర్ధిక లోటుని పూడ్చడానికి అయన పదవిలోకి వచిన్నప్పటినుంచి కష్టపడుతూనే ఉన్నారు. అందరూ చూస్తూనే ఉన్నారుగా, ఆయన దేశ దేశాలు తిరిగి ఆ దేశాల వాళ్ళని మన దేశం లో పెట్టుబడులు పెట్టమని కోరుతున్నారు. అదే కాకుండా ఎన్నో ఆర్ధిక సంస్కరణలు తీసుకువచ్చి మన దేశం లో పెట్టుబడులు పెట్టడానికి బయట దేశాలకు ఎర్ర తివాచి పరిచారు.

అయితే అందరికి తెలిసిన రహస్యం ఏంటంటే, మన దేశంలో నల్ల బాబుల దగ్గర ఉన్న డబ్బు అంతా బయటకి తీస్తే వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం మనకి లేదు అని. డబ్బు బయటకి తీయడం అంటే ఆ డబ్బుని బ్యాంకులో వేయడం ఒకదారి.

మోడీ గారు నల్ల బాబులకి ఒక ఆఖరి అవకాసం ఇచ్చారు. సెప్టెంబర్ ౩౦ లోగా మీ డబ్బుని లెక్కల్లో చూపి టాక్స్ కట్టి తెల్ల డబ్బుగా మార్చుకోమని. కానీ ముందుకు వచ్చింది చాలా తక్కువమంది. ఇక వేరే దారి లేక 500/1000 నోట్లు మార్చాల్సిందే అని ఆదేశించారు.

ఈ విషయం మాకు తెల్సిందే కదరా అనుకుంటున్నారా? ఆగండి ఆగండి ఇక్కడే ఉంది అసలు సిసలైన కిక్కు ఇచ్చే మోడీ పంచ్.

రోజూ మనం టీవీ లో చూస్తున్నాం, రెండున్నర లక్షలు దాటితే మీ పని అయిపోయింది అని ప్రభుత్వం అందరినీ భయపెడుతుంది. మనలో చాలా మందికి ఒక సందేహం వచ్చే ఉండాలి, ఏమని అంటే, "ఇలా భయపెడ్తే డబ్బులు ఎవరు వేస్తారు బ్యాంకులో? బ్యాంకులో వేస్తే జైల్లో పెడతారన్న భయంతో నల్ల బాబులు డబ్బుని చెత్తలో, కాలవల్లో పారేస్తున్నారు. కొంత మంది కాల్చేస్తున్నారు. మొత్తం డబ్బు అంతా ఎవరికీ ఉపయోగపడకుండా పోతుంది కదా ?" అని.

అసలు నల్ల బాబులు డబ్బులు బ్యాంకులో వేయకూడదు అనేదే ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే డిసెంబర్ 30 తారీకు లోపు డబ్బులు బ్యాంకులో వేయకపోతే ఇక అవి చిత్తు కాగితాలతో సమానం అని మనకి తెలుసు. కాబట్టి అక్రమంగా సంపాదించిన సొమ్ము మొత్తం ఒక్క దెబ్బతో నాశనం అయిపోతుంది.

జనవరి 1వ తేదీకి మన ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బుకి, ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి చాలా తేడా వస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడా డబ్బు ఉండదు కాబట్టి, ప్రభుత్వం మళ్ళీ కొత్త నోట్లు ముద్రిస్తుంది. వహ్రే వా మోడీ గారూ... మీ ఆలోచనకి పాదాభివందనం అయ్యా. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.

కొత్త నోట్లు ముద్రించుకోడం వల్ల నల్ల బాబులు బ్యాంకులో వేయలేని డబ్బు మొత్తం మళ్ళీ ప్రభుత్వం దగ్గరకు రాజమార్గంలో వచ్చేస్తుంది. అవినీతిపరుల పని ఖతం.
అన్ని లక్షల కోట్లు ప్రభుతం వద్దకు వచ్చేసరికి మన దేశ ఆర్ధిక పరిస్తితి ఒక్కసారిగా లోటు నుంచి మిగులులోకి వచ్చేస్తుంది.

ప్రభుత్వం వద్ద ఉన్న అధిక డబ్బు తో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యొచ్చు. మన దేశ రూపం ఒక్కసారిగా మారిపోతుంది.

ఇప్పుడు కూడా మీరు లైన్లో నుంచున్నందుకు బాధ పడుతున్నారా? బాధ పడకండి మనం లైన్ లో నుంచుని మన దేశాన్ని బాగు చేసుకుంటున్నాం. ఈ కష్టానికి వేల రెట్లు ఫలితాలు పొందుతాం.

ఈ విషయం తెలియని వాళ్ళందరికీ తెలిసేలా ఈ పోస్టుని షేర్ చేయండి. మన దేశం బాగుపడబోతుంది .


Search Website

Featured Post

10 Tourist Places to Visit in Coorg - తెలుగులో కూర్గ్ ట్రిప్ - Scotland of India

Click for  English Version -   కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు ఇప్పుడు మీరు చదవబోయె ప్రాంతం. ఇక్కడి లోయల్ని, కొండ ...

Popular Articles